ఉత్తరాంధ్ర బ్రాహ్మణ మహాసభ – స్వాగతం

ప్రియమైన బ్రాహ్మణ సోదర, సోదరీమణులారా,

మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది బ్రాహ్మణ సమూహం ఉంది. మనలో చాలా మంది వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరియు పౌరోహిత్యం వంటి వివిధ వృత్తుల్లో సముచిత స్థానాల్లో స్థిరపడి ఉన్నారు.

మనందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ, మన కట్టుబాట్లు, నడవడిక మరియు జీవన విధానాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఒక దిక్సూచిగా నిలవడానికి ఈ “డిజిటల్ అగ్రహారం” రూపొందించబడింది.

ఈ వేదిక ద్వారా మన సమాజ వృత్తి నిపుణులు మరియు సేవా ప్రదాతల వివరాలతో కూడిన నిర్దేశిక, యువతకు ఉపాధి అవకాశాలు, మరియు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వైవాహికం వంటి విశేష విభాగాలను మీరు ఉపయోగించుకోవచ్చు. మన పూర్వీకులు అందించిన విలువలు మరియు ఆచారాలను తెలుసుకోవడానికి మన సంప్రదాయం విభాగాన్ని సందర్శించగలరు. దీనితో పాటుగా, ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రయోజనాల కోసం ప్రయోజనాల మార్గదర్శి అనే విభాగాన్ని కూడా ఇక్కడ పొందుపరిచాము.

మన ప్రాంతీయ విశేషాలు మరియు తాజా అప్‌డేట్స్ కోసం వర్తమానం విభాగాన్ని సందర్శించగలరు. మనమందరం ఈ డిజిటల్ అగ్రహారంలో భాగస్వాములై, మన ప్రాంతీయ బంధాన్ని మరియు ఆత్మీయతను మరింత బలోపేతం చేసుకుందాం.

మరింత సమాచారం లేదా సూచనల కోసం మమ్మల్ని సంప్రదించగలరు.

సదా మీ సేవ లో


చెరువు రామకోటయ్య
కన్వీనర్


వర్తమానం

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

నిర్దేశిక – వృత్తి నిపుణులను, సేవా ప్రదాతలను శోధించండి

No Results found!

No Results found!